UPDATED 24th JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్ పర్సన్ డి.ఎ. సత్యప్రభ, ఉమెన్ చిల్డ్రన్ డిజబుల్ ఓల్డేజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ మంగళవారం ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కమిటీ చైర్ పర్సన్ డి.ఎ. సత్యప్రభ, శాసనసభ్యులు జి. లక్ష్మీదేవి, యు. కల్పన, వి. రాజేశ్వరి, ఎంఎల్సీ పోతుల సునీత ఉన్నారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, కాకినాడ ఆర్డీవో రఘుబాబు, వేదపండితులచే మంగళ వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో కమిటీకి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందచేశారు. అనంతరం కమిటీ చైర్ పర్సన్ డి.ఎ. సత్యప్రభ చాణుక్య కుమారరామ భీమేశ్వరస్వామి వారి పేరుమీద రూ. లక్ష రూపాయల చెక్కును ఈవోకు విరాళంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ పిడి ఎన్. సీతామహాలక్ష్మీ, కమీటీ డిప్యూటీ సెక్రటరీ పి. బాలకృష్ణమాచార్యులు, సెక్షన్ ఆఫీసర్ వి. భిక్షం, తహసీల్దార్ ఎల్. శివకుమార్, దేవస్థానం పాలకమండలి సభ్యులు, ఐసిడిఎస్ సిడిపివోలు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







