UPDATED 7th AUGUST 2017 MONDAY 6:00 PM
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కు చెందిన పిజిడిఎం విద్యార్థులు ఇంటర్న్ షిప్ లో భాగంగా 45 రోజులు పాటు ఐడిబిఐ ఫెడరల్ లో శిక్షణ పొందినట్లు బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కె. సుజాత, నీలిమశ్రీ, ఆదిత్య వంశీ ఇంటర్న్ షిప్ లో భాగంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని, కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రారంభంలో ట్రైనీ బిజినెస్ లీడర్ గా, తరువాత సీనియర్ ఏజెన్సీ లీడర్ గా పదోన్నతి పొందడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మంచి వేతనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా పిఎఫ్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు వర్తిస్తాయన్నారు. విద్యార్థులు ఇంటర్న్ షిప్ లో విశేష కృషి జరిపి రూ.1.85 లక్షలు బిజినెస్ చేసినందుకుగాను కె. సుజాతకు ప్రథమ బహుమతి, రూ.55 వేలు నగదు, ట్రోఫీ, రూ.1.75 లక్షలు బిజినెస్ చేసిన నీలిమశ్రీ కు ద్వితీయ బహుమతిగా రూ.48 వేలు, ట్రోఫీ, అలాగే రూ.1.55 లక్షలు బిజినెస్ చేసిన ఆదిత్య వంశీ కి రూ.34 వేలు నగదు, ట్రోఫీ ని బ్రాంచ్ హెడ్ జె.వి.ఎస్. అన్నపూర్ణ అందచేశారు. ఈ కార్యక్రమంలో అజెన్సీ లీడర్ హబీబ్ ఉన్నీసా, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, వైస్ ప్రిన్సిపాల్ ఆస్తా శర్మ, మెంటార్ ఎస్.కె. సౌజన్య, సి ఆర్ టి ట్రైనీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.







