Bheemla Nayak: న్యూఇయర్‌ పార్టీలో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాల్సిందే..!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పవన్‌ పాత్ర కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ రాసిన విషయం తెలిసిందే. ‘లాలా బీమ్లా’ అంటూ సాగే ఈ పాట.. అరుణ్‌ కౌండిన్య ఆలపించారు. తమన్‌ మ్యూజిక్‌ అందించారు. ఇప్పటికే ఈ సాంగ్‌ మిలియన్ల కొద్ది వ్యూస్‌ సొంతం చేసుకుంది. తాజాగా కొత్త సంవత్సరం వేడుకల్లో మరింత జోష్‌ నింపేందుకు ‘భీమ్లానాయక్‌’ టీమ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘లాలా భీమ్లా’ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేసింది. ‘‘డీజే సౌండ్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. న్యూ ఇయర్‌ పార్టీలో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవడం ఖాయం’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ సిద్ధమవుతోంది. అహం, ఆత్మగౌరవం మధ్య పోరు ఏవిధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్‌.. ‘భీమ్లానాయక్‌’ అనే పోలీస్‌ అధికారిగా, రానా.. ‘డేనియల్‌ శేఖర్‌’ పాత్రలో కనిపించనున్నారు. పవన్‌ సరసన నిత్యామేనన్‌, రానాకు జంటగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us