UPDATED 5th FEBRUARY 2018 MONDAY 6:00 PM
సామర్లకోట: భావితరాలకు ఆదర్శంగా సమితి సేవలు విస్తరించాలని ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ తోటకూర సూర్యనారాయణ వర్ధంతిని సమితి సభ్యులు పెంటపాటి మల్లిఖార్జునరావు, నువ్వుల బాబ్జి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయి రామకృష్ణ మాట్లాడుతూ పెద్దలు అందించిన సమితి ద్వారా సమాజానికి ఉపయుక్తమైన, ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలన్నారు. అనంతరం గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి సమితి తరఫున 25 కేజీలు బియ్యం, దుస్తులు, రూ. మూడు వేలు నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ సూర్యనారాయణ కుమారులు, కార్యదర్శి వి. విశ్వనాధం, సమితి సభ్యులు నువ్వుల వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.







