UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 05:00 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దర్శన టికెట్ల పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. ఈ నెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేస్తామన్నారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళమిచ్చిన వారికి ఉదయాస్తమాన టికెట్లు జారీచేస్తామన్నారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చి ఉదయాస్తమాన సేవా టికెట్ పొందవచ్చని టీటీడీ ఈవో తెలిపారు.







