AP News : కర్నూలు ఎస్పీ పేరు చెప్పితో రూ.15 లక్షలు దోచేసిన

UPDATED 26th MARCH 2022 SATURDAY 10:50 AM

Kurnool CI miss used Power రూ.15 lakhs : పోలీసుల లంచగొండితనానికి మరో ఘటనలో ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. అందినకాడికి దోచుకోవటమే కాకుండా అక్రమాల్లో పట్టుబడ్డ డబ్బుల్ని కూడా దోచేస్తున్న ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా(Kurnool District) పోలీసులు(Police)చేతివాటం మరోసారి బయటపడింది. ఓ సీఐ అవినీతి బాగోతం బట్టబయలైంది. కర్నూలు సీఐ ఏకంగా ఎస్పీ పేరు చెప్పి రూ.15 లక్షలు దోచేశాడు. ఈ విషయం కాస్తా బయటపడటంతో తేలుకుట్టిన దొంగలాగా పరారయ్యాడు కర్నూలు సీఐ రాముడు.

కర్నూలు శివార్లలోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ దగ్గర మార్చి 19న భారీగా నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో హైదరాబాద్ నుంచి తమిళనాడుకు 75 లక్షలు తీసుకెళ్తున్న సతీష్ బాలకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SEB అధికారులు. నగదు తరలింపుకు సంబంధించి ఎటువంటి దృవపత్రాలు చూపించపోవటంతో ఓ పద్ధతి ప్రకారం కేసును తాలూకా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.

ఇక ఇక్కడే మొదలైంది అసలు కథా కమామీషు. భారీగా డబ్బు పట్టుబడింది అనే సమాచారంతో సీఐ కంబగిరి రాముడు సీన్ లోకి ఎంటర్అయ్యాడు.నగదు తరలింపు గురించి నిందితుడు బాలకృష్ట రెండు రోజులు తరువాత నగదుకు సంబంధించి అన్ని రశీదులూ తీసుకొచ్చాడు. ఆ రసీదులు అధికారులకు ఇచ్చి తన నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వమని సీఐ రాముడిని కోరాడు. కానీ ఆ డబ్బుపై దురాశ పెంచుకున్న సీఐ రాముడు డబ్బు తిరిగి ఇవ్వటానికి ఆ కథ ఈ కథ చెప్పుకొచ్చాడు.

ఇలా రశీదులు ఇవ్వగానే అలా డబ్బు ఇచ్చేయటం కుదరదు..దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇచ్చి పేపర్స్ సరిపోవు మరిన్ని సాక్ష్యాలు కావాలంటే బాలకృష్ణకు చెప్పాడు. దీంతో అన్ని ఇచ్చాను కదా సార్..డబ్బు ఇచ్చేయండి అని బతిమాలాడు. కానీ సీఐ రాముడు ప్లాన్ వేరేగా ఉంది. అందుకే డబ్బు ఇప్పుడే ఇవ్వటం కుదరదు అని చెప్పాడు.

ఆ తరువాత తన అసలు ప్లాన్ తో స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంత డబ్బు ఎస్పీకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. పోలీసులతో ఇలా విషయం సాగదీస్తే అసలుకే మోసం వస్తుందనుకున్నాడో ఏమోగానీ బాలకృష్ణ అలాగే సార్ అన్నాడు వేరే దారిలేక. అలా తన ప్లాన్ తో సీఐ రాముడు పట్టుబడ్డ 75 లక్షల్లో బాలకృష్ణకు కేవలం 60 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు సీఐ. మిగతా 15 లక్షలు తనే నొక్కేశాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సీఐ రాముడు గుట్టు బయపడింది.

దీనిపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. నాపేరు చెప్పి ఇలా చేస్తావా? అంటూ సీఐపై ఫైర్ అయ్యారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించారు. డబ్బు తీసుకున్నది నిజమేనని తేలింది. సీఐ కంబగిరి రాముడుపై కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న సీఐ.. పరారయ్యాడు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. కాగా సీఐ కంబగిరి రాముడు చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. నంద్యాలలో పనిచేసి సస్పెండయ్యారు. డోన్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా రాముడుపై పలు ఆరోపణలున్నాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us