UPDATED 16th DECEMBER 2017 SATURDAY 9:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ మేరకు ఆయనను కాకినాడలో ఆయన స్వగృహంలో కలుసుకుని పుష్పగుచ్ఛం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నబాబు నేతృత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే పార్టీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాస్, పిట్ల రమణ, ఎలుగుబంటి వీరబాబు, బెంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.







