YS Jagan: 13న సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇలా..

UPDATED 11th JULY 2022 MONDAY 09:40 AM

YS Jagan: ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ నెల 13వ తేదీన (బుధ‌వారం) విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌నకు సంబంధించిన వివ‌రాల‌ను సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ ప‌ట్ట‌ణం విమానాశ్రయానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేరుకుంటారు.

ఉద‌యం 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు.అనంతరం వైఎస్సార్‌ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంత‌రం వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్‌ జరుగుతుంది. 11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి.

ఉద‌యం 11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి మ‌ధ్యాహ్నం 12.17 గంటల వ‌ర‌కు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడతారు.మ‌ధ్యాహ్నం 12.20 నుంచి వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు సీఎం చేతులమీద‌గా పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us