Pawan Kalyan PM Modi Meeting : ఏపీలో మంచి రోజులు వస్తాయి -ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

UPDATED 11th NOVEMBER 2022 FRIDAY 11:10 PM

Pawan Kalyan PM Modi Meeting : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేనాని అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సమావేశం. విశాఖపట్నం పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలిశారు. ప్రధానితో శుక్రవారం రాత్రి పవన్ భేటీ అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.

ప్రధానితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ చెప్పారు.

తనకున్న అవగాహన మేరకు అన్ని విషయాలు చెప్పానన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us