మన సంస్కృతిలో అంతర్భాగమే యోగా

UPDATED 21st JUNE 2017 WEDNESDAY 11:00 AM

కాకినాడ: మన భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమే యోగా అని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఆయుష్ శాఖ, ఆర్ట్ అఫ్ లివింగ్, పతంజలి, బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చలన క్రియలు, ప్రాణాయామం మొదలైన యోగాసనాలు గురువుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, జిల్లా అటవీ శాఖాధికారి నందినీ సలారియా, ట్రైనీ ఎస్పీ వి.అజిత, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్ తదితరులు యోగాను నిష్ఠతో ఆచరించారు. సుమారు  గంటసేపు ఈ యోగా క్రియలో వివిధ శాఖల జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వై. మాల కొండయ్య, మున్సిపల్ కమీషనర్ ఆలిం బాషా, డిఆర్వో జితేంద్ర, ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రతినిధులు కృష్ణకుమార్, సత్యవతి, రఘువానంద్, ఆయుష్ వైద్యుడు డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us