యూనివర్సిటీ లెవెల్ పోటీలకు ఎంపికైన గైట్ క్రీడాకారులు

UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 7:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలకు చెందిన క్రీడాకారులు జె.ఎన్.టి.యు.కె జోన్-బి వాలీ బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ పోటీల్లో రన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎం. హెన్రీ తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఈ పోటీలు గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగాయని, రన్నర్స్ గా నిలిచిన తమ కళాశాల క్రీడాకారులు మార్చ్ 9, 10 తేదీల్లో గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి నలందా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే యూనివర్సిటీ లెవెల్ పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ప్రతిభ చూపాలని కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను చైతన్య సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు), గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, కబడ్డీ కోచ్ అప్పారావు దొర, తదితరులు పాల్గొన్నారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us