రెడ్ బీ న్యూస్, 27 డిసెంబర్ 2021: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు చిరంజీవి.. సుకుమార్‌ని కలిసి ఆయన్ను ప్రశంసించారు. సంబంధిత ఫొటోల్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ప్రతి సన్నివేశాన్నీ చిరంజీవి ఎంతగానో ఆనందించినట్టు పేర్కొంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది ప్రారంభంకానుంది.







