CJI: రామప్పను దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ములుగు (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021 : యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐ దంపతులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ దర్శనం అనంతరం సీజేఐ అక్కడి నుంచి వరంగల్‌ చేరుకుని రాత్రికి నిట్‌ అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం నగరంలోని భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత కోర్టు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us