Road Accident: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టుల మృతి

బ్యాంకు ఉద్యోగి కూడా.. మరొకరికి గాయాలు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021‌: నగరంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు  డ్రైవ్‌ చేస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. మరో జూనియర్‌ ఆర్టిస్ట్ సిద్ధుకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులను అబ్దుల్‌ రహీమ్‌, ఎన్‌.మానస(23), ఎం.మానస(21)గా గుర్తించారు. వీరు అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్‌.. మాదాపూర్‌లోని యాక్సిన్‌ బ్యాంకులో పని చేస్తున్నారు. ఇతడిని విజయవాడ వాసిగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us