ఘనంగా వినాయక చవితి వేడుకలు

UPDATED 13th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

పెద్దాపురం: వినాయకచవితిని పురస్కరించుకుని స్థానిక ఏడవ వార్డు కాకర్లవారి వీధి, ఆర్.టి.సి బస్ కాంప్లెక్స్ వద్ద   సిద్ది వినాయక టాక్సీ స్టాండ్ నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సుభిక్షంగా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గణనాధుని వేడుకున్నట్లు తెలిపారు. దేశమంతటా గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తారని, పండుగల్లో మొదట వినాయక చవితి నిర్వహించి తదుపరి అన్ని పండుగలు జరుపుకోవడం హిందూ సాంప్రదాయంలో ఒకటని అన్నారు. ప్రజలందరూ భక్తిభావంతో, ఐకమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కురిపూరి రాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, సామర్లకోట ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, కాకినాడ రామారావు, రంధి సత్యనారాయణ, డాక్టర్ తాళాబత్తుల సాయి, సిద్ది వినాయక టాక్సీ స్టాండ్ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us