ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబరు 2021: కార్తీకమాసం ఆఖరి శనివారం వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలినడకన స్వామి సన్నిధికి చేరుకుని తలనీలాలు, కానుకలు సమర్పించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.8,48,580 ఆదాయం లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
వెంకన్న సేవలో సినీ నటి ఝాన్సీ
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం సినీ కేరెక్టర్ ఆర్టిస్టు, యాంకర్ ఝాన్సీ దర్శించుకున్నారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈసందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ ఏడు శనివారాలు ఆలయంలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకోవడం ద్వారా కోరిన కోర్కెలు తీరుతాయని తెలుసుకుని స్వామివారిని దర్శించుకున్నానన్నారు. స్వామివారు ఎంతో మహిమ గలవారని, దర్శనం సంతృప్తినిచ్చిందన్నారు.







