UPDATED 31 MARCH 2022 TUESDAY 08:00 PM
Hyderabad Metro: ఇంతకుముందెన్నడూ లేనట్టి అన్లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలు, పబ్లిక్ హాలీడేస్ సమయంలో ఈ ఆఫర్ సూపర్ బెనిఫిట్స్ అందించనుంది.
సమ్మర్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సహాయంతో సెలవు రోజుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని సూచించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుంది.