Naga Shaurya : షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన నాగశౌర్య.. హాస్టిటల్‌కు తరలింపు!

UPDATED 14th NOVEMBER 2022 MONDAY 5:30 PM

Naga Shaurya : టాలీవుడ్ యువహీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో అస్వస్థకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఇటీవలే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. చాలా రోజుల తరువాత మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొనడంతో నాగశౌర్య ఆరోగ్యం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు సన్నిహితులు. గత నాలుగు రోజులు నుంచి ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న శౌర్య డీహైడ్రేషన్ కి గురై కళ్ళు తిరిగి పడిపోయినట్లు తెలుస్తుంది. అపస్మారక స్థితిలో ఉన్న నాగశౌర్యని హుటాహుటిన గచ్బౌలి లోని హాస్పిటల్ కు తరలించారు. సిక్స్ పాక్స్ చూపించడం కోసం నాలుగు రోజులుగా వాటర్ డైట్ చేయడమే ఇందుకు కారణం అంటున్నారు.

కాగా ఇటీవలే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కి వివాహం కూడా నిశ్చయమైంది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టిని వివాహం చేసుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొన్నాడు. నవంబర్ 20, 2022న ఉదయం 11:25 గంటలకు నాగశౌర్య, అనూషకి మూడు ముళ్ళు వేయనున్నాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us