UPDATED 17th OCTOBER 2022 MONDAY 08:00 AM
YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఒక్కో రైతుకు 4వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92లక్షల మంది రైతులకు రూ. 2,096,04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.







