NTR: ఎన్టీఆర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తారక్, చరణ్ ఫ్యాన్స్ మార్చి 25న భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మళ్లీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కబోతుంది. ‘అరవింద సమేత’ ఛాన్స్ మిస్ అయిన కొలవెరి కుర్రాడు అనిరుధ్ ఈ సినిమాతో తారక్‌తో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

కొరటాల సినిమా తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌లో తారక్ సినిమా చెయ్యాలి. కానీ ‘సలార్’ రెండు పార్టులు అనుకోవడంతో ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడట. ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత రెహమాన్ సంగీతమందిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. కథ ప్రకారం మ్యూజిక్‌కి చాలా మంచి స్కోప్ ఉండడంతో రెహమాన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ ఆయణ్ణి అప్రోచ్ అయ్యారని సమాచారం. రెహమాన్‌తో ఎన్టీఆర్‌కి ఇది ఫస్ట్ సినిమా. ‘ఉప్పెన’ తర్వాత రెండో మూవీకే రెహమాన్ వంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌తో వర్క్ చేసే అవకాశం బుచ్చిబాబు దక్కింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us