చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

పెద్దాపురం, 26 మే 2020 (రెడ్ బీ న్యూస్): చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను పెద్దాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి వారిని మీడియా ఎదుట హాజరుపరిచారు. అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు విలేఖరులకు వెల్లడించారు. పట్టణంలో స్థానిక కవాడీ వీధిలో గత నెల 21న మొగలుతుర్తి వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తన కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఇదే అదునుగా తలచి పట్టణానికి చెందిన వేముల మాణిక్యాచారి, వేముల సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో యజమాని లేడని గ్రహించి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. ఆరు లక్షల 40 వేల నగదు, 330 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళారు. ఇంటి యజమాని తిరిగి ఈనెల 9న ఇంటికి వచ్చి చూడగా తన ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయినట్లు గుర్తించాడు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ జయకుమార్ కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా చోరీకి పాల్పడిన ఇద్దరి పైనా అనుమానం కలగడంతో తమదైన శైలిలో పోలీసులు విచారిండంతో అసలు విషయం తెలిసింది. నిందితుల నుంచి రూ. ఐదు లక్షల 60 వేలను స్వాధీనం చేసుకున్నామన్నాని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ బాలచంద్రారెడ్డి, ఎస్సైలు సురేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us