UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00 PM
సామర్లకోట: ప్రకృతి వ్యవసాయం పద్ధతులతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మండల పరిధిలోని అచ్చంపేట గ్రామంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం వచ్చారు. వీరితో పాటు తూర్పు గోదావరి జిల్లా డీడీఏ ట్రైనింగ్ మధుసూదనరావు, కాకినాడ సబ్ డివిజన్ ఏడీఏ సి. భవాని పాల్గొన్నారు. కేంద్ర బృందం సభ్యులు రైతులతో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఎన్పిఎం వర్క్ షాపును సందర్శించి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడే అన్ని వనరులు ఉన్నట్లు బృందం గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సందర్శన ఏఈవో అర్. శ్రీనివాసరావు, ఎంపీఈవో సి.హెచ్. శివ, కామేష్, సీఆర్పీ ఎన్. రామారావు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







