ఆనందకరం.. ఆరుద్ర వీక్షణం

శ్రీకాళహస్తి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: శ్రీకాళహస్తీశ్వరుని జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని ముక్కంటి ఆలయంలో విశేష వేడుకలు నిర్వహించారు. శ్రీశివకామసుందరి సమేత నటరాజస్వామితో పాటు మాణిక్యవాసగర్‌ ఉత్సవర్లకు విశేష పూజలు, ప్రత్యేక అభిషేక సేవలు నిర్వహించారు. ఆలయ అనువంశీక ప్రధాన దీక్షాగురుకుల్‌ స్వామినాథన్‌ నేతృత్వంలో యాగపూజలు నిర్వహించారు. ఆరుద్ర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని నిజరూప దర్శనంతో పాటు పిండిలింగాన్ని భక్తకోటి దర్శించుకున్నారు. వేడినీళ్ల అభిషేకం సందర్భంగా స్వామి, అమ్మవార్ల ప్రధాన ఆలయాల్లో మూడున్నర గంటల మేర దర్శనాలు నిలిపేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us