Illegal Money Seized : హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు పట్టివేత

UPDATED 12th OCTOBER 2022 WEDNESDAY 03:30 PM

Illegal Money Seized : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తులు డబ్బుకు సంబంధించిన వివరాలు చెప్పకపోవడం, పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.కొరియర్‌ సంస్థ ముసుగులో గురజరాత్‌ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత 10 రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల హవాలా సొమ్ము నగరంలో పట్టుబడటం గమనార్హం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us