UPDATED 1st DECEMBER 2017 FRIDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీ జి.ఎస్.జి నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 25 మంది విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన శిక్షణతో ఆంగ్లభాషలో సంపూర్ణ పరిజ్ఞానం సాధించడంవల్లే తమ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. జి.ఎస్.జి. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఎంపికలో వ్రాత పరీక్ష, మౌఖిక, భావవ్యక్తీకరణ అంశాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని, వీరికి మూడు నుంచి నాలుగు లక్షలు వార్షిక వేతనంతో హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, మేనేజ్మంట్ విభాగాధిపతి జి. సుమ, తదితరులు అభినందించారు.







