PRC :మేము చర్చించుకుని పిలుస్తాం..సిద్ధంగా ఉండండి: మంత్రుల కమిటీ

Updated 1 February 2022 Tuesday 03:20 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై తమ అభిప్రాయాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు నేతలు మంత్రుల కమిటీకి తెలిపారు. అయితే దీనిపై మంత్రుల కమిటీ ఏ విషయమూ స్పష్టం చేయలేదని పీఆర్సీ సాధన సమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ అంశాలపై తాము కూడా చర్చించుకుని మళ్లీ పిలుస్తామని.. సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ తెలిపింది. అనంతరం సీఎం జగన్ నివాసానికి మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్లారు. మంత్రుల కమిటీ దృష్టికి పీఆర్సీ సాధన సమితి నేతలు తీసుకొచ్చిన అంశాలపై సీఎంతో బొత్స చర్చించనున్నట్లు సమాచారం. సీఎం చేసిన సూచనలు, తీసుకునే నిర్ణయం అనంతరం తిరిగి పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రుల కమిటీ చర్చించే అవకాశముంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us