UPDATED 1st NOVEMBER 2022 TUESDAY 06:30 AM
TTD : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమవారం దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు దక్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, దక్షిణామూర్తి కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి శ్రీ దక్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు.







