UPDATED 14th FEBRUARY 2022 MONDAY 08:30 PM
నర్సీపట్నం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమిస్తామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వున్న 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా చేసుకొని 26 జిల్లాలు చేస్తున్నారని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వస్తున్న అభ్యంతరాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు చెప్పారు. నాడు-నేడు, అమ్మఒడి వంటి పథకాలతో విద్యాభివృద్ధికి విశేష కృషిచేస్తున్నారని వివరించారు. పాలనా వికేంద్రీకరణ కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారని ధర్మన కృష్ణదాస్ పేర్కొన్నారు.







