TDP Special Logo : 40 వసంతాల తెలుగుదేశం.. ప్రత్యేక లోగో ఆవిష్కరణ

UPDATED 25th MARCH 2022 FRIDAY 09:00 PM

40 Years TDP : 40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక లోగో ఆవిష్కరించారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. 2022, మార్చి 25వ తేదీ శుక్రవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు జాతి కష్టల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో టీడీపీని స్థాపించడం జరిగిందని, టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా వేడుకలు ఉండాలని సూచించారు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 40 ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గ్రామ గ్రామాన జెండావిష్కరణలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజాభిమానంతో కొనసాగుతున్న పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులేనని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు.

మరోవైపు…2022, మార్చి 29వ తేదీ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడుతామని నారా లోకేశ్ ప్రకటించారు. చట్టసభల్లో తమ గొంతు నొక్కినా… ప్రభుత్వ తప్పిదాలను మాత్రం వదిలిపెట్టమని ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థపై దాడికి దిగలేదని, 10వ తరగతి తప్పిన వ్యక్తి ఆలోచనతో న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us