Statue of Equality : సమతామూర్తి… మూడో రోజు కార్యక్రమాలు

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 06:30 AM

ముచ్చింతల్,రంగారెడ్డి (రెడ్ బీ న్యూస్): ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 6 గంటల 30నిమిషాలకు ప్రారంభమైన అష్టాక్షరీ మహామంత్ర జపం 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హోమాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10 గంటల 30నిమిషాలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనాలు. మధ్యాహ్నం 12 గంటల 30 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది.

సాయంత్రం 5 గంటలకు మరోసారు హోమాలు చేస్తారు. ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇర భవిష్యత్తులో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు యావత్‌ దేశానికే గర్వకారణమన్నారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. గంట మండపంలో భారీ గంటను మోగించారు.

● శుక్రవారం ఉదయం 06.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అష్టాక్షరీ మహామంత్ర జపం.

● 8.30 గంటలకు హోమాలు.

● 10.30 గంటలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీ కృష్ణమాచార్య ప్రవచనాలు

● మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.

● సాయంత్రం 5 గంటలకు హోమాలు.

● శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టి.

● లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us