అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. రానున్న 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యలను వారు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.







