ఘనంగా గీతాజ్ఞానయజ్ఞం

Updated 10th April 2017 Monday 11.10 AM
పెద్దాపురం: పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఉన్న శ్రీ రామభక్తాశ్రమం 45 వ వార్షికోత్సవం సందర్భం గా వైభవంగా గీతాజ్ఞానయజ్ఞాన్నిసోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా గణపతిపూజ, ఓంకారపూజ,ప్రణవపతాకావిష్కరణతో గీతాజ్ఞానయజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సనాతన ధర్మగీతాప్రచారకులు మల్లికార్జునస్వామి మాట్లాడుతూ ఈ నెల పదకొండు న పూర్ణాహుతి కార్యక్రమంతో వార్షోకోత్సవాలు ముగుస్తాయని అదే రోజు ఆంజనేయస్వామి వారికి తమలపాకులతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యజ్ఞంలో కడప జిల్లా గండి క్షేత్రం మాతాజీ ప్రతిభానందగిరిస్వామిని, లక్ష్మీనరసాపురం సూర్యానందస్వామి, ధర్మవరం సూర్యనందస్వామి, పలువురు ఆశ్రమ పీఠాధిపతుల ఆద్వర్యంలో ఈ గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించనున్నట్లు మల్లికార్జున స్వామి తెలిపారు.  ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రచార సమితి కన్వీనర్ పచ్చిపాల ప్రసాదరావు (గోరింట ప్రసాద్), అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us