UPDATED 27th JUNE 2017 TUESDAY 5:30 PM
పెద్దాపురం: ప్రతీ ఒక్కరు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగాలని 18 బెటాలియన్ ఎన్ సి సి కేడెట్ కెప్టెన్ కృష్ణారావు అన్నారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద
ఎన్ సి సి ఆఫీసర్ సతీష్ సారధ్యంలో ఎన్ సి సి కేడెట్లు స్వచ్ఛభారత్ నిర్వహించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. అలాగే జాతర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు. అనంతరం కెప్టెన్ కృష్ణారావు, ఎన్ సి సి ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ ఎన్ సి సి కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథం, ఎన్ సి సి కేడెట్లు పాల్గొన్నారు.







