కోడిపందేలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: జిల్లాలో కోడిపందేలు, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఫంక్షన్‌ హాళ్లు, తోటలు వంటి ప్రాంతాల్లో జూదాలు, కోడిపందేలు నిర్వహిస్తే వాటి యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా పోలీసులు గ్రామాల్లో ప్రజల సహకారంతో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్‌తోపాటు మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 9నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా అనేక దాడులు నిర్వహించామన్నారు. గతంలో కోడిపందేలు, గుండాట, పేకాట వంటి కేసుల్లో అరెస్టైన వారిపై నిఘా ఉంచామని చెప్పారు. ఇప్పటివరకు 310 కేసులు నమోదు చేసి 1143 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1048 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us