Samantha : సమంత ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి ఎంత సంపాదిస్తుందో తెలుసా??

UPDATED 29 MARCH 2022 TUESDAY 06:00 AM

Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత క్రేజ్‌ మరింత పెరిగింది. విడాకుల తర్వాత మొదటి సారి ‘పుష్ప’ సినిమాలో ఐటెంసాంగ్ తో కనిపించడంతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సామ్‌ విడాకులు అనంతరం వరస అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత చేతిలో అరజనకు పైగానే చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, తమిళ్ సినిమాలతో పాటు ఓ ఇంటర్నేషనల్ సినిమా కూడా ఉంది.

సినిమాలకి తన రెమ్యునరేషన్ కూడా పెంచేసింది సమంత. ఇక సినిమాలతో పాటు మరో పక్క కమర్షియల్ యాడ్స్ కూడా బాగానే ఉన్నాయి సమంత చేతిలో కమర్షియల్స్ కి అయితే మరింత ఎక్కువ తీసుకుంటుంది రెమ్యునరేషన్. వీటితో పాటు సోషల్ మీడియాలో కూడా సంపాదిస్తుంది సమంత. ఇటీవల చాలా కమర్షియల్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ గురించి స్టార్స్ తో వారి సోషల్ మీడియాలలో పోస్ట్ చేయిస్తున్నారు. ఇలా పోస్ట్ చేయించినందుకు భారీగానే అమౌంట్ ఇస్తున్నాయి ఆ కంపెనీలు.

ఇక సమంత ఐతే సోషల్ మీడియాలో పెట్టే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పోస్టులకి భారీగానే డిమాండ్ చేస్తుంది. ఆ సంస్థ రేంజ్ ని బట్టి కూడా డిమాండ్ చేస్తుంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో కమర్షియల్ పోస్టుకి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు డిమాండ్‌ చేస్తుంది. అయితే ఇది కేవలం పోస్ట్ వరకే. వీటికి సంబంధించిన ఫొటోషూట్స్‌, వీడియోలు లాంటివి పోస్ట్ చేయాలంటే దానికి డబల్ అమౌంట్ అడుగుతుంది సమంత. ఇక ఇన్ స్టాగ్రామ్ కూడా కొంతమంది సెలబ్రిటీలకు వారి రీచ్ ని బట్టి వారి ఫాలోవర్స్ ని బట్టి వాళ్ళు పెట్టే పోస్టులకి కూడా డబ్బులు చెల్లిస్తుంది. ప్రస్తుతం సమంతకి ఇన్‌స్టాగ్రామ్ లో 22.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సమంతకి చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఈ లెక్కన సమంత రెండు చేతులతో నాలుగు రకాలుగా బాగానే సంపాదిస్తుంది. విడాకుల తర్వాత ఈ సంపాదన మరింత పెరిగింది అనే చెప్పొచ్చు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us