జనసేన నుంచి ముగ్గురు ఎంపీ లు కన్ఫర్మ్...!

UPDATED 27th JULY 2017 THURSDAY 9:00 PM

2019 ఎన్నిక‌ల‌కు పార్టీల‌న్నిక‌స‌ర‌త్తుల్లో మునిగిపోయాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన కూడా రోజురోజుకు స్పీడ‌వుతోంది. ప్ర‌స్తుతానికైతే జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తుండా, లేదా అన్న‌ది క్లారిటీ లేదు. ప‌వ‌న్ ఇంకా ఎక్క‌డ ఎవ‌రిని లీడ‌ర్లుగా నియ‌మించ‌క‌పోయినా జ‌న‌సేన అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి రెడీ అంటున్నారు. ఇక ఇంట‌ర్న‌ల్‌గా కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల పేర్లు ఖ‌రారైన‌ట్టు కూడా తెలుస్తోంది. ఏపీలో కీల‌క‌మైన కృష్ణాజిల్లాలో రెండు ఎంపీ స్థానాల‌కు జ‌న‌సేన నుంచి అభ్య‌ర్థుల పేర్లు కూడా తెర‌ మీద‌కు వ‌స్తున్నాయి. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌కు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పీవీపీ పేరు వినిపిస్తోంది. ప‌వ‌న్ ఆయ‌న‌కే టిక్కెట్ దాదాపు ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. జిల్లా కేంద్ర‌మైన బంద‌రు నుంచి మాజీ ఎంపీ బాడిగ రామ‌కృష్ణ పేరు లైన్లో ఉంది. బందరుకు బాడిగ పేరును జ‌న‌సేన అభిమానులే డిసైడ్ చేసిన‌ట్టు వినిపిస్తోంది. ఇక కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్న గోదావ‌రి జిల్లాలోని కాకినాడ నుంచి ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇలా ఈ మూడు లోక్‌స‌భ స్థానాల‌కు జ‌న‌సేన అభ్యర్థులు ఖ‌రారైన‌ట్టు టాక్ వ‌స్తోంది. మిగ‌తా నియోజకవ‌ర్గాల‌కు వ‌రుస‌గా అభ్య‌ర్థుల‌ను ఇప్పుడే ఎంపిక చేయాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు టాక్. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us