కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా వైకాపా నాయకుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు అనంతబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతబాబు, మరో ఇద్దరు నామపత్రాలు దాఖలు చేయగా... ఒకరిది పరిశీలనలో తిరస్కరణకు గురవగా... మరొకరు నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారు. తుదిగా అనంతబాబు ఒక్కరే పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈమేరకు రిటర్నింగ్ అధికారి, జేసీ సుమిత్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం ధ్రువపత్రం అందజేశారు. జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







