UPDATED 8th JANUARY 2018 MONDAY 7:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనా అంశాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఆధునిక పరిజ్ఞాన అభివృద్ధి అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ టి.సి.ఎస్ సీనియర్ కన్సల్టెంట్ కె. సూర్యనారాయణ, కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల పరిశోధనలకు అందుబాటులో ఉన్న విప్లవాత్మక, ఉద్భవిస్తున్న నూతన పరిజ్ఞానాన్ని తెలియచేస్తుందన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన రిటైర్డ్ టి.సి.ఎస్ సీనియర్ కన్సల్టెంట్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ మెకానికల్ విభాగంలో మెటల్ ఫార్మింగ్, మెటల్ ఫినిషింగ్, మొదటి ఐదు రకాల నూతన పోకడలు, వాటి అప్లికేషన్స్, వారి అనుభవాలను విద్యార్థులకు తెలియచేశారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి, పేపర్ పబ్లికేషన్స్, నైపుణ్యాలు విస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశంలోని ప్రతీ ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి నూతన పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, మెకానికల్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి.కుమార్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ పి. సుకుమార్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







