UPDATED 16th JUNE 2022 THURSDAY 09:10 AM
Sachivalayam Employees : ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందరికి ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వనున్నారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే వేతనాలు చెల్లించనుంది ప్రభుత్వం.ఇప్పటివరకు లక్ష మందికిపైగా ప్రొబేషన్ డిక్లరేషన్ కు అర్హులుగా ఉన్నారని.. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం తెలిపింది. వచ్చే ఆగస్టు 31వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికి ప్రొబేషన్ డిక్లరేషన్ వచ్చేలా వరుస పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.







