జిల్లాను అగ్రగామిగా నిలుపుతా

Updated 20th April 2017 Thursday 1: 50 PM

కాకినాడ: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ అందరి సహకారం,భాగస్వామ్యంతో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియచేశారు. ఈ సందర్భం గా గురువారం ఉదయం 11:45 నిముషాలకు తన ఛాంబర్ లో  పదవీ భాద్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేస్తానన్నారు. సమర్ధవంతమైన జిల్లా యంత్రాంగాన్ని లక్ష్య సాధనతో ముందుకు సాగేలా చైతన్య పరుస్తానన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను అధికారులతో సమీక్షించి సత్వర సంపూర్ణ ప్రయోజనాలు సాధించేందుకు ప్రణాళికలు, దిశా నిర్దేశాలను చేపడతానన్నారు. పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్ గా సేవలు అందించే అవకాశం తనకు లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, రెవిన్యూ అసోసియేషన్ కార్య వర్గ సభ్యులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ విజయ రామరాజు , సబ్ కలెక్టర్ విజయ్ కృష్ణన్, సమాచార శాఖ డిడి ఫ్రాన్సిస్ ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.     
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us