ఉపకారవేతనాలను ఆన్ లైన్ చేయాల్సిన బాధ్యత బీమా మిత్రలదే

UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: ఉపకారవేతనాలను ఆన్ లైన్ చేయాల్సిన బాధ్యత బీమా మిత్రలదే అని డిపిఎం కేశవ్ అన్నారు.   స్థానిక టిటిడిసి ఆవరణలో ఏరియా కో-ఆర్డినేటర్ హేమ నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన బీమామిత్రల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల ఉపకారవేతనాల వివరాలను ఆన్ లైన్ చేయాల్సిన బాధ్యత బీమామిత్రలపై ఉందని తెలిపారు. స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాలపై తిరిగి చెల్లింపులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, భీమామిత్రలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us