UPDATED 27th DECEMBER 2017 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టించి పనిచేయాలని పెద్దాపురం నియోజకవర్గ వైసిపి కన్వీనర్ తోట సుబ్బారావునాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భగా వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ స్వగృహంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ విజయానికి జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రచ్చబండ, గడపగడపకు వైసిపి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు మరింత రెట్టించిన ఉత్సాహంతో కష్టించి పనిచేయాలన్నారు. అనంతరం వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసిపిలో చేరేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, ధరణికోట యోహాన్, గోపు మురళి, కర్రి శ్రీనివాస్, పిట్ల రమణ, ఎలుగుబంటి వీరబాబు, గంటా శేషు, బెంజిమెన్, తదితరులు పాల్గొన్నారు.







