20 నుంచి శుభప్రదం శిక్షణా శిబిరం

Updated 18th April 2017 Tuesday 7:00AM

పెద్దాపురం: ఈ నెల 20  నుంచి స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ లో విద్యార్థినీ, విద్యార్థులకు  శుభప్రదం కార్యక్రమంలో భాగంగా వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార మండలి జిల్లా సహాయ కార్యదర్శి రేపాక ప్రసాద్ తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆద్వర్యం లో ఈ కార్యక్రమం వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా సంస్కృతి సంప్రదాయాలు నైతిక విలువలు ఆచరణీయ ధర్మాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు 9247221354 , 7013745927 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us