ఆదిత్యలో కృత్రిమ మేధస్సుపై అవగాహనా సదస్సు

UPDATED 12th MARCH 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, దాని ప్రాధాన్యతపై సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐఐఎం, ఇండోర్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎం.కె. భట్టా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కృత్రిమ మేధస్సు, ఉపయోగాలు, ప్రాధాన్యతల గురించి వివరించారు. కృత్రిమ మేధస్సుపై విద్యార్థులచే నూతన ఆవిష్కరణలను, అప్లికేషన్స్ ను చూపారు. కృత్రిమ మేధస్సుతో మానవుడు మరొక సృష్టికర్తగా మారతాడని, ఇప్పటికే ఈ విధానంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధస్సు మరింత ప్రభావం చూపుతుందని, ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రానున్నాయని,  విద్యార్థులు ఈ రంగంలో అవగాహన పొందేందుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు ప్రొఫెసర్లు ఎ. వానతి, ఎన్. రాజబాబు, సి.హెచ్. ఉదయ్ భాస్కర్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us