UPDATED 8th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
రంపచోడవరం: ఆదివాసీ గిరిజనులు సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రస్పుటంగా ప్రతిబింబించే రీతిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవేడుకలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు సబ్ కలెక్టరు, ఇంచార్జ్ ఐటిడిఎ పివో డాక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ వేడుకలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలకు ఐటిడిఎ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ ఉంటుందని, 10.15 గంటలకు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ సందర్శన ఉంటుందని అన్నారు. 10.30 గంటలకు వివిధ ప్రభుత్వ పధకాల క్రింద మంజూరైన లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం, 10.40 గంటలకు గౌరవ ముఖ్య అతిధులను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. 10.50 గంటలకు పతాక ఆవిష్కరణ,11 గంటలకు వేడుకలు ప్రారంభోత్సవ జ్యోతి ప్రజ్వలన, 11.15 గంటలకు గిరిజన కులపెద్దల సందేశాలు, 11.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన, మధ్యాహ్నం 12.30 గంటలకు అతిధుల సందేశాలు, మధ్యాహ్నం ఒంటి గంటకు వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన గిరిజనులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కావున ఆదివాసీ గిరిజనులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.







