రాయదుర్గం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: నగరంలోని గచ్చిబౌలి టెలికాంనగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందారు. తాను ఉంటున్న హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్‌రెడ్డి (30) మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.







