టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్

అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న(సోమవారం) లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయితే.. ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us