Crime News: రుణాల పేరుతో మోసం: విజయ ఏరో బ్లాక్స్‌ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 ‌: రుణాల పేరిట బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై విజయ ఏరో బ్లాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు మేరకు విజయ ఏరో బ్లాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్లు నర్రా ప్రసన్న కుమార్‌, చిగురుపాటి రాంప్రసాద్‌, నర్రా లక్ష్మీప్రసన్న, నర్రా విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విజయ ఏరో బ్లాక్స్‌ పేరిట రుణాలు తీసుకొని ఇతర వ్యాపారాలకు మళ్లించి.. తర్వాత రుణ చెల్లింపులను ఎగవేశారని అభియోగం. అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు దస్త్రాలు, లావాదేవీల వివరాలను సమర్పించినట్టు సీబీఐకి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అక్రమాల వల్ల సుమారు రూ.44 కోట్ల మేర నష్టం జరిగిందని అభియోగం. ఈమేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us