Google: గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఆ రూల్స్‌ పాటించకపోతే ఉద్యోగం ఉఫ్‌!

యూఎస్ఏ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం.. సిబ్బందికి ఇటీవల మెమో జారీ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ‘‘డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించి సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలి’’ అని గూగుల్ ఆ మెమోలో సూచించింది. ఆ తేదీలోగా వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేయని ఉద్యోగులు, ఇంకా టీకా తీసుకోని వారు, మినహాయింపునకు అనుమతి రాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్‌ కాంటాక్ట్‌ చేస్తోంది. వారందరికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్‌ ఆ మెమోలో పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 18 నాటికి గూగుల్‌లోని ప్రతి ఒక్కరూ కంపెనీ వ్యాక్సినేషన్‌ రూల్స్‌ పాటించాలని స్పష్టం చేసింది. అప్పటికీ రూల్స్ పాటించని ఉద్యోగులను 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులో పంపిస్తామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు ‘వ్యక్తిగత సెలవు’లిచ్చి ఆ తర్వాత విధుల నుంచి తొలగిస్తామని గూగుల్‌ హెచ్చరించినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. అయితే ఈ కథనంపై గూగుల్‌ అధికార ప్రతినిధి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us