UPDATED 22 JANUARY 2022 SATURDAY 08.00 AM
అనంతపురం (రెడ్ బీ న్యూస్) : కూడేరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లి సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.







